రాష్ట్రంలో యూరియాని కూటమి నేతలు బ్లాక్ మార్కెట్కు తరలించి వ్యాపారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కర్నూలు నగరంలోని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నివాసంలో అన్నదాత పోరు పోస్టర్ను వారు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రైతులకు ఎటువంటి మేలు చేయలేదని పెట్టుబడు సాయం కూడా అరకోరగా అందించి చేతులు దులుపుకున్నారని వారు విమర్శించారు. కర్నూలు జిల్లాలో ఉల్లి ,టమోటా రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు నిర్లక్ష్యంా వ్యవహరిస్తున్నారని తెలిపారు.