Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ అయిన నా భర్త రాజేందర్ ను అక్రమంగా కేసులో ఇరికించారంటూ జిల్లా కలెక్టర్ కు కలిసి వినతి పత్రం అందజేసిన రాజేందర్ భార్య పద్మ.ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి ఎలాంటి మచ్చ లేకుండా పిల్లలకు బోధిస్తూ సక్రమంగా తన విధులు నిర్వహించుకుంటూ కొనసాగే వాడు అలాంటి సమయంలో పాఠశాల ఎస్ఓ మరియు ఇతర టీచర్లు సిబ్బంది కలిసి కావాల్సికొని నా భర్తను కేసులో ఇరికించారని, పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని తెలిపింది పద్మ