తాడిపత్రి పట్టణ శివారులోని హిందూ స్మశాన వాటికను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పూల మొక్కల నర్సరీ నిర్వాహకలతో కలసి స్మశానంలో పర్యటించారు. హిందూ స్మశాన వాటికను బృందావనంలో మారుస్తామని మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా పక్షుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా హిందూ స్మశాన వాటికను చేస్తామని తెలిపారు.