విధులకు గైర్హాజరైన వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం ఇంద్రవెల్లి మండలం లోని ప్రాధమిక అరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసి రిజిస్టర్ లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా, లేరా పరిశీలించగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ చేయలన్నారు