తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బేతంచెర్ల సీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సాగరిక అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ బేతంచెర్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు తప్పనిసరిగా కాచి వడగట్టిన నీటిని తాగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని పేర్కొన్నారు.