పెనుకొండ మునిసిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని మంత్రి సవిత తెలిపారు. శుక్రవారం సాయంత్రం పెనుకొండ పట్టణంలో ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ తో కలసి 92 లక్షల రూపాయల నిధులతో వై జంక్షన్ నుండి మార్కెట్ యార్డ్ వరకు సెంటర్ లైటింగ్ కోసం భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు.