శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జి సిగడం మండలం గడ్డకంచరామ్ గ్రామానికి చెందిన పూక్కల రాజశేఖర్ అనే వ్యక్తిపై పక్క గ్రామానికి చెందిన గోబ్బరు శంకర్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఇద్దరు పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు కలిసి బాతువ గడ్డకంచరాం జంక్షన్ వద్ద మద్యం విషయంలో తగదపడ్డారు. దీంతో శంకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కత్తితో కడుపులో బలంగా పొడిచాడు. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు. గమనించిన స్థానికులు ఆదివారం సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు రిమ్స్ ఆసుపత్రి తరలించారు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్రీకాకుళం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.