నంద్యాల జిల్లానందికొట్కూరు రైతులు వేసే పంటల ఖర్చులు తగ్గించి పంటల ఆదాయం ఏ విధంగాపెంపొందించుకోవాలనే వాటి గురించి మరియు ప్రకృతి వ్యవసాయంపై నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎంసీ మద్దిలేటి వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇచ్చారు. నందికొట్కూరు పట్టణంలోని ఆత్మ భవనంలో నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం గిరీష్ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు.సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతింటోందని,భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆహారం అందించాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. (ప్రీ-మన్సూన్ డ్రై సోయింగ్)