వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల అశోక్ (35)చింతకుంట చెరువులో తూము వద్ద ఇసుక బస్తాలు వేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేష్ తెలిపారు. చెరువు తూము నుండి నీరు వృధాగా పోతున్నందున కట్టడి చేసేందుకు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇసుక బస్తాలు వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.