గుత్తి మండలం తొండపాడు లో శుక్రవారం భూతగాదా విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జయ రాములు, సుంకప్ప, పకీరప్ప, వెంకటరాముడు అన్నదమ్ములు.వీర మధ్య గత కొంతకాలంగా భూ తగాదా నడుస్తోంది. ఈ క్రమంలో సుంకప్ప, పకీరప్ప, వెంకట రాముడు లు ముగ్గురు అన్నదమ్ములు ఏకమై మరో సోదరుడు జయరాములు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. జయ రాములు ఈయన భార్య వరలక్ష్మి, కొడుకు నరేష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.