యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోందని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి ఆరోపించారు. మంగళవారం మద్యాహ్నం రైతులతో కలిసి కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ కణేకల్లు, బొమ్మనహాల్ మండలావ రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ రెండు మండలాల్లోనే సుమారు 30 వేల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. పచ్చకండువాలు వేసుకున్న వారే యూరియా బస్తాలు పంపిణీ చేస్తూ అర్హులైన రైతులకు మెండిచేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.