ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం అవసరం: జిల్లా ఎస్పి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ, క్రీడలలో పాల్గొనాలని జిల్లా SP గంగాధర రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలో క్విట్ ఇండియాలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎస్పీ తెలిపారు. సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం కాపాడుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. ఈ ర్యాలీలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.