కడప జిల్లా కమలాపురం పెన్నా నది వద్ద గురువారం గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను, లైటింగ్ కొరకు పనులను సిఐ ఎస్.కె రోషన్ ఎస్సై విద్యాసాగర్ పిఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి. ఎలక్ట్రికల్ ఏడి పరిశీలించారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే వాహనాలు ఎటువైపు నుండి ఎటువైపు వెళ్ళాలి, నిమజ్జనం ఎలా చేయాలి, నిమజ్జనానికి లేట్ అయితే అక్కడ లైటింగ్ ఏర్పాటును చేయడానికి అధికారులు సమన్వయంతో పరిశీలించారు. నిమజ్జనం జరిగే సమయంలో నిమజ్జనానికి వచ్చిన వారు జాగ్రత్తగా ఉండి నిమజ్జనాన్ని పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాలని వారు తెలిపారు.