గొలగమూడి లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రాలు నడుమ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండడం తమ అదృష్టం అని సోమిరెడ్డి అన్నారు.