బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో సోమవారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ ఆలోచన అని, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.