పద్మనాభం మండలంలో పద్మనాభం గ్రామంలో కొలువైయున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జయంతి ఉత్సవాలను దేవాదాయ శాఖ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉండే భక్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయ పండితులు స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. అనంతరం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను స్వామివారి పల్లకిలో పుర వీధుల్లో ఊరేగించారు.