గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డి ఆర్ డి ఏ,పంచాయతీ రాజ్ , మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం , అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వెయిట్ మేనేజ్మెంట్ యూనిట్, సెక్రికేషన్ షెడ్, అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్షి