రిమ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి NFIW రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నలిని రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ కార్మికుల పెండింగ్ సమస్యలపై అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం అందజేశారు. 3 సంవత్సరాలుగా వివిధ కాంట్రాక్టర్లు మారినా కానీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవడం లేదన్నారు. రిమ్స్ లోని శానిటేషన్ కార్మికులు, పేషెంట్ కేర్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు, దాయ కార్మికులు, 30 సంవత్సరాలుగా రిమ్స్ లో పని చేసినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రిమ్స్ లో ఉన్నటువంటి అధికారులు విఫలమయ్యారని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూన్నారన్నారు.