మెదక్ జిల్లా భవన నిర్మాణ కార్మికులు సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గతంలో సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్న లబ్ధిదారుల వద్ద పర్సెంటేజీలు వసూలు చేసి అక్కడున్న మేస్త్రీల ద్వారా ఇవ్వాలని వేధించడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు మెదక్ జిల్లాలో కూడా భవన నిర్మాణ మేస్త్రీలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి కోసం సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం నగేష్ వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.