ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పీలేరు కోర్టు 11వ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ తెలిపారు. శనివారం పీలేరు మండలం మర్రిపాకుల తండా గ్రామంలో నల్సా జాగృతి అవగాహన కార్యక్రమంలో భాగంగా చైల్డ్ మ్యారేజెస్,చిన్న వయసులో గర్భం దాల్చడం ద్వారా కలిగే అనర్ధాల పై హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పీలేరు కోర్టు 11వ అదనపు జిల్లా జడ్జి ఎ మహేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.జడ్జి ఎ.మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి నడుచుకోవాలని తెలిపారు.పిల్లలకు చిన్న వయసులో వివాహాలు చేయడం వలన వారు గర్భం దాల్చిన తరువాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు