కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక మద్రాస్ బస్టాండ్ ప్రకాశం పంతులు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చేపల మార్కెట్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్, జలపుష్ప భవన్, సౌదాగర్ షాపింగ్ కాంప్లెక్స్ లలోని అద్దె షాపులను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అద్దె షాపులను వేలం దారులు నిర్వహిస్తున్నారా లేక సబ్ లీజుకు ఇచ్చి నిర్వహిస్తున్నారా అని వాకబు చేశారు. షాపుల అద్దె బకాయిలు క్రమం తప్పకుండా నగర పాలక సంస్థకు చెల్లించాలని, బకాయిలు ఉంటే ఉపేక్షించబోమని షాపు నిర్వాహకులకు కమిషనర్ సూచించారు.