వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం వినాయక నిమజ్జనా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను జిల్లా కేంద్రంలోని ట్యాంక్బండ్తోపాటు నాగనూలు వద్ద చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.