శ్రీ సత్య సాయి జిల్లా పరిగిలోని ZP బాలుర ఉన్నత పాఠశాల సేవా మందిర్లో యూటీఎఫ్ సమావేశం ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతరం యూటీఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ఆర్.రామకృష్ణ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.