*కాకినాడ* : ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ ఆదేశించారు.సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు.టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ వంటి విభాగాలకు సంబంధించిన 12 పైగా సమస్యలు కూడిన అర్జీలను ప్రజలు కమిషనర్ భావనకు అందజేశారు.. వాటిపై సంబంధిత శాఖాధికారులను వెంటనే స్పందించాలని కమిషనర్ సూచించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కూడా ఆదేశించారు.