వీణవంక: మండల కేంద్రంలో యూరియా లోడ్ తో లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు సోమవారం సాయంత్రం లారీని అడ్డగించారు. నర్సింగాపూర్ PACS గోదాంకు వెళ్తుండగా అడ్డుకున్నారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతులకు ఆ యూరియాను పంపిణీ చేయాలని సుమారు గంటపాటు ఆందోళన చేశారు. ఎస్ఐ ఆవుల తిరుపతి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ యూరియాను విణవంక మండల కేంద్రానికి పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లారీని నర్సింగాపూర్ గోదాంకు పంపించకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు.టోకెన్లు ఇస్తున్నారా అనే సమాచారంతో ఒకసారిగా అక్కడికి చేరుకొని రైతులు బారులు తీరారు