పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవశాత్తు ఒక గుడిసెలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయన ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని, బాధితుల కుటుంబాన్ని ఓదార్చారు. అంతరం ఆర్బి ఫౌండేషన్ తరపున తుంగతుర్తి రవి బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.