చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల గ్రామంలో కోదండరామాలయంలో బుధవారం మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు రామస్మరణలతో మారుమోగాయి.