సుగాలి ప్రీతి ఇష్యూలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం లేనప్పుడు ఊగిపోయాడని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రీతి విషయంలో కేసు ముందుకే వెళ్ళటం లేదని మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం విజయవాడ గాంధీనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడక ముందు పవన్ కళ్యాణ్ కేకలు వేసి గగ్గులు పెట్టాడని ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి విషయంలో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారికి ఎందుకు శిక్ష విధించలేదని ప్రశ్నించారు