దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు. నాయకులు గజేంద్ర వెంకట రత్నం, నారాయణ రెడ్డి కంబాలప్ప, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.