పరిగి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. నేడు శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాఫర్ పల్లి అర్బన్ పార్కు ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారి శివకుమార్ రెడ్డి, హెచ్ఎండిఏ, ఎఫ్ ఆర్ వో సత్యనారాయణమ్మ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జాఫర్ పల్లి లో 144 ఎకరాల్లో విస్తరించి ఉన్న అర్బన్ పార్కును పరిశీలించినట్లు తెలిపారు విశ్రాంతి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పరిగి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే ప్రభ