జమ్మికుంట మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ DM&HO డాక్టర్ చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ వాన చలి అని లేకుండా నిరంతరం మున్సిపల్ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారు పారిశుద్ధ కార్మికులని వారికి ఎటువంటి సీసన్ వ్యాధి ప్రబలకుండా వారి ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలని పలు సూచన చేశారు ప్రతి ఒక్కరు ఆరోగ్యపట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.