సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్ని గ్రామాల నిర్వాహకులు వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని ఎస్సై క్రాంతి కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం అన్ని గ్రామాల నిర్వహకులు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ వినియోగం తగ్గించాలని నిర్దేశించిన మార్గంలోనే నిమజ్జనం చేయాలని సూచించారు.