ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మార్వాడీల అరాచకత్వం అణిచివేత ఎక్కువైందని అన్నారు. గతంలో మార్వాడీల పైన పాట పాడిన రమేషును ఎస్ఓటి పోలీసులు అకారణంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజల మధ్య మార్వాడీలు కుల మతాల చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.