రంపచోడవరంను జిల్లా చేయాలంటూ రాజవొమ్మంగి మండలంలోని లోదోడ్డి పంచాయితీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సర్పంచ్ లోతా రామారావు తెలిపారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో ఉన్న రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రం పాడేరు వెళ్లాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని రామారావు అన్నారు. ప్రస్తుత జిల్లా కేంద్రం కన్నా రాష్ట్ర రాజధాని దగ్గరని రామారావు వ్యాఖ్యానించారు. రంపచోడవరం జిల్లా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.