ఖాజీపేట (M) రావులపల్లె సచివాలయ పరిధిలో దుంపలగట్టు, రావులపల్లె గ్రామాలలో వరి నాట్లు పనులు ప్రారంభమయ్యాయని, రైతుల అవసరాలకు సరిపడ యూరియా అందించకపోవడం అధికారుల నిర్లక్ష్య అని రైతు సేవ సమితి జిల్లా అధ్యక్షులు రమణ అన్నారు. బుధవారం రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. రైతులు యూరియాకు ఇబ్బందులు పడుతున్నా అధికార ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవటం న్యాయం కాదన్నారు. యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు.