రామ్కీ ఫార్మ సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికలాంగుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తానం గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి మూడు చక్రాల వాహనంపై వెళ్తుండగా లారీ టాంకర్ ఢీకొంది ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు.