నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్డి నివాసం వద్ద ఉన్న హరిత హోటల్ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు మెయిన్ రోడ్డుకు వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా వచ్చిన నేతలను కార్యకర్తలను అదుపు చేయలేక గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.