వారికి ఊరు తెలియదు పేరు తెలియదు, ఒక్కయాచక వృత్తి వాళ్లకు జీవనాధారం... రోడ్డుకు అనుకుని ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో యాచక వృత్తి చేసుకుంటూ వెళ్లిపోవడమే వారికి తెలుసు... సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యాచక వృత్తి చేసుకుంటూ రోడ్డు వెంబడి వర్షంలో నడుచుకుంటూ వెళుతుండగా ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడం మండలం వాడ్రంకి గ్రామం జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ మహిళ, ఓ పురుష యాచకులు మృతి చెందారు. వీరు కొన్ని సంవత్సరాలుగా పొందూరులో నివాసం ఉంటూ స్థానికంగా యాచక వృత్తిని అనుసరిస్తున్నారు. ప్రమాదవసత్తు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మీరు అక్కడికక్కడే మృతి చెందారు.