తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 104లో పని చేస్తున ఉద్యోగుల 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని,ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని CITU జిల్లా అధ్యక్షులు రాజేందర్ అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగుల తో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనాలు రాక 104 ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వారికి పని భారం పెంచారు..కానీ జీతాలు మాత్రం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 104 ఉద్యోగులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.