అన్నవరం క్వారీలో అక్రమాలు జరిగాయాని నిరూపించే దైర్యం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉందా అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సవాల్ విసిరారు. తన క్వారీకి వచ్చే ముందు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలని పరిశీలించి రావాలని సూచించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడే తన క్వారీని ఏమీ పీకలేకపోయారని.. ఇప్పుడేం చేస్తారు అంటూ నెల్లూరులో ఆయన మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రశ్నించారు