బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. గార మండలం సైరిగాం గ్రామంలో వరద నీరు పోటెత్తింది. మరోవైపు శ్రీకాకుళం నగరంలో వర్షం కారణంగా రోడ్లు చెరువును తలపిస్తున్నాయి.. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు నిల్చిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటు ఇచ్చాపురం నుంచి అటు రణస్థలం వరకు అన్ని మండలాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది..