కడప జిల్లా జమ్మలమడుగు లోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో సోమవారం బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాతరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ రఫిక్ భాష మరియు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొని తమ సందేశాన్ని రక్తదాతలకు తెలిపారు.ఈ సందర్భంగా సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, ప్రజలందరూ కూడా ఇటువంటి అపోహలను వదిలి రక్తదానం విరివిగా చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.