ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో పద్మ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70 వ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ముద్ర వేసుకొని నటనలో ఎంతో కొంత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్ఫూర్తినిచ్చిన వారు చిరంజీవి అని కొనియాడారు. సినీ రంగంలోనే కాక సేవా రంగంలో మొదటిగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.