సక్రమమైన సదుపాయాలు సమకూర్పే సమర్థవంతమైన విధి నిర్వహణకు మూలాధారం అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇతర జిల్లాల నుండి విధులు నిర్వర్తించడానికి హాజరయ్యే పోలీస్ సిబ్బంది యొక్క సదుపాయాల నిమిత్తం తుళ్లూరు గ్రామంలో CRDA వారి అనుమతితో ఉపయోగంలో లేని NAC కార్యాలయాన్ని పునరుద్ధరించి బుధవారం సాయంత్రం ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. వినియోగం కోసం పోలీస్ సిబ్బందికి అందించారు.