బాన్స్ వాడ ఆర్టీసీ బస్టాండు శిధిలావస్థకు చేరుకున్నందున నూతన బస్టాండు నిర్మించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించాలని సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవికి భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. శిధిలావస్థకు చేరిన బస్టాండ్ ను కూల్చివేసి పట్టణ శివారులో నూతన బస్టాండును నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. నూతన బస్టాండు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు ప్రస్తుతం ఉన్న బస్టాండు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు డి ఎం వెల్లడించినట్టు బిజెపి పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి తెలిపారు.