నంద్యాల జిల్లా మహానంది మండలంలో ఆదివారం వ్యవసాయ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలపై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బుక్కాపురం ,గాజులపల్లి గ్రామంలోని మహానందిశ్వర ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ బైసాని ట్రేడర్స్ గఫారియా పెస్టిసైడ్స్ ఎరువులు పురుగుల మందు దుకాణం తనిఖీలు చేయడం జరిగింది. కి తనిఖీల్లో భాగంగా పలు అవుకులకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు ఎరువుల నియంత్రణ చట్టం ఈసీ యాక్ట్ ఆరు ఏ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.