తిరుమలాయపాలెం మండల పరిధి, మాదిరిపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు వెళ్తున్న ట్రాలీ (కంటైనర్), ఖమ్మం వైపు వస్తున్న బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ట్రాలీ డ్రైవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ గ్రామానికి చెందిన ఉప్పుతల నాగేశ్వరరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, అతన్ని 108 అంబులెన్స్ సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.