అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అతిథులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం