అవనిగడ్డ లో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు రూ. 20,62,587 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల దరఖాస్తులపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి సహాయం అందిస్తున్నారని తెలిపారు.