ప్రకాశం జిల్లా మార్కాపురం సిఐ సుబ్బారావు ఆదివారం వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో సైకిల్ తొక్కుతూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు వివరిస్తూ సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ పట్టణంలో సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు.